Breaking News

విలువలో టీసీఎస్‌ నంబర్‌ 1

Published on Fri, 09/20/2024 - 03:42

న్యూఢిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా టీసీఎస్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్‌ బ్రాండ్జ్‌ రిపోర్ట్‌లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి. టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 49.7 బిలియన్‌ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది. గతేడాది నుంచి చూస్తే టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 16 శాతం పెరిగింది. ఏఐ, డిజిటల్‌ విభాగాల్లో టీసీఎస్‌ చేసిన పెట్టుబడులు బ్రాండ్‌ విలువ పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 38.3 బిలియన్‌ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. 18 బిలియన్‌ డాలర్ల విలువతో ఎస్‌బీఐ ఐదో స్థానంలో నిలవగా, 15.6 బిలియన్‌ డాలర్లతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆరో స్థానంలో, 11.5 బిలియన్‌ డాలర్ల విలువతో ఎల్‌ఐసీ పదో స్థానంలో నిలిచాయి. గతే డాది నుంచి చూస్తే 54 బ్రాండ్లు తమ విలువను పెంచుకున్నాయి. భారత్‌లోని టాప్‌–75 బ్రాండ్ల విలువ అద్భుతమైన రీతిలో ఏడాదిలోనే 19 శాతం పెరిగి 450.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు కాంటార్‌ బ్రాండ్జ్‌ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల బ్రాండ్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. మొత్తం బ్రాండ్ల విలువలో 17 ఆర్థిక సేవల బ్రాండ్ల రూపంలోనే 28 శాతం ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.  

జొమాటో స్పీడ్‌.. 
ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో చాలా వేగంగా తన విలువను రెట్టింపు చేసుకున్నట్టు కాంటార్‌ బ్రాండ్జ్‌ నివేదిక తెలిపింది. 3.5 బిలియన్‌ డాలర్ల విలువతో జాబితాలో 31వ స్థానాన్ని సొంతం చేసుకుంది. బజాజ్‌ ఆటో 20వ స్థానంలో ఉంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా బ్రాండ్‌ విలువ ఏడాదిలో 78 శాతం పెరిగింది. 30వ స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 1535 బ్రాండ్లకు సంబంధించి 1.41 లక్షల మంది అభిప్రాయాలను కాంటార్‌ సంస్థ పరిగణనలోకి తీసుకుంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)