Breaking News

టాటా గ్రూప్‌ కంపెనీకి చైర్మన్‌గా గణపతి సుబ్రమణ్యం

Published on Fri, 03/14/2025 - 20:00

టాటా గ్రూప్‌నకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్‌గా ఎన్‌ గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా గణపతి సుబ్రమణ్యం నియామకానికి టాటా కమ్యూనికేషన్స్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.

ఎన్‌జీఎస్‌గా ప్రసిద్ధి చెందిన గణపతి సుబ్రమణ్యం 2021 డిసెంబర్‌లో టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్)తోపాటు భారత ఐటీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లుగా ఉన్నారు. 2024 మేలో టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు.

నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 14 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమించిందని టాటా కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, టెలికాం, పబ్లిక్ సర్వీసెస్‌లో టీసీఎస్ చేపట్టిన పలు మైలురాయి కార్యక్రమాల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఛేంజ్ మేనేజ్మెంట్‌పై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని  పేర్కొంది.

ప్రస్తుతం గణపతి సుబ్రమణ్యం టాటా ఎలెక్సీ లిమిటెడ్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ లో బోర్డు చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా,   టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే భారత్ 6జీ అలయన్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్‌ టెక్నాలజీలో ఇన్‌స్టిట్యూట్ బాడీ సభ్యుడిగా, ముంబైలోని దివ్యాంగ పిల్లల పునరావాస సొసైటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్