Breaking News

సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభం

Published on Fri, 10/18/2024 - 13:51

ముంబై: టాటా కెమికల్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 50 శాతం మేర తగ్గి రూ.267 కోట్లకు పరిమితమైంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.190 కోట్లతో పోల్చితే పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.495 కోట్లుగా ఉండడం గమనార్హం.

ఆదాయంలో పెద్దగా మార్పు లేకుండా రూ.3,999 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,998 కోట్లుగా ఉంది. ‘‘భారత్‌లో సోడాయాష్‌కు డిమాండ్‌ స్థిరంగా ఉంది. అమెరికా, యూరప్‌లో కంటెయినర్‌ గ్లాస్‌ తదితర విభాగాల్లో డిమాండ్‌ స్తబ్దుగా ఉంది. జూలై, ఆగస్ట్‌లో అసాధారణ వర్షాలతో మిథాపూర్‌ ప్లాంట్‌లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉత్పత్తి తగ్గడంతో మార్జిన్లపై ప్రభావం పడింది’’అని టాటా కెమికల్స్‌ ఎండీ, సీఈవో ఆర్‌ ముకందన్‌ తెలిపారు.

మార్చి త్రైమాసికంతో పోల్చితే పనితీరు మొత్తం మీద మెరుగపడినట్టు చెప్పారు. కస్టమర్లను అట్టిపెట్టుకోవడంతోపాటు స్థిరమైన కార్యకలాపాలపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా కెమికల్స్‌ షేరు 2.41 శాతం క్షీణించి రూ.1,074 వద్ద ముగిసింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు