ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు
Published on Fri, 08/21/2026 - 08:23
కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ ఆగస్టు నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, లాయల్టీ బెనిఫిట్, ‘ఫ్రీడమ్ సెలబ్రేషన్’ ఆఫర్లను కలిపి అందిస్తోంది. ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ మోడళ్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు ఉంది. వేరియంట్, మోడల్ ఇయర్, పాత కారు ఎక్స్ఛేంజ్, లాయల్టీ అర్హత వంటి అంశాలపై తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.
టియాగో, టిగోర్‌పై ఆఫర్లు
కొత్తగా వచ్చిన టియాగో ఫేస్‌లిఫ్ట్‌పై అధికారిక తగ్గింపులు లేవు. అయితే, మిగిలిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో స్టాక్‌పై ఎంపిక చేసిన వేరియంట్లకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, ఫ్రీడమ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠ ప్రయోజనం సుమారు రూ.35,000 వరకు ఉంటుంది. టిగోర్‌పై కూడా రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకు
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో ఈవీపై మాత్రం గణనీయమైన ప్రయోజనాలు కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన లాంగ్ రేంజ్ XT వేరియంట్‌పై నగదు, ఫ్రీడమ్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఇతర టియాగో ఈవీ వేరియంట్లపై కూడా రూ.65,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
ఆల్ట్రోజ్‌పై రూ.45,000 వరకు
ఆల్ట్రోజ్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి రూ.45,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.40,000 వరకు ఉంది.
పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు
సాధారణ పంచ్‌పై ఈ నెలలో పెద్దగా అధికారిక తగ్గింపులు లేవు. అయితే, పంచ్ ఈవీపై ఎంపిక చేసిన వేరియంట్లకు భారీ ప్రయోజనాలు ఉన్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, స్మార్ట్ వేరియంట్లపై రూ.95,000 వరకు బెనిఫిట్ ఉంది.
నెక్సాన్‌పై రూ.55,000 వరకు
నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.45,000 వరకు, సీఎన్‌జీ మోడళ్లపై రూ.55,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై మాత్రం ప్రధానంగా ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలే ఉండటంతో గరిష్ఠ బెనిఫిట్ రూ.20,000 వరకు ఉంది. నెక్సాన్ ఈవీపై గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంది. ఇందులో నగదు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉంటాయి.
కర్వ్‌పై భారీ డీల్.. ఈవీపై మరింత ఎక్కువ
టాటా కర్వ్ ఐసీఈపై ఈ నెలలో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.45,000 స్క్రాపేజ్ ప్రయోజనం, అర్హత ఉన్నవారికి రూ.50,000 లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.
అయితే అసలు హైలైట్ కర్వ్ ఈవీ. ఎంపిక చేసిన వేరియంట్లపై నగదు తగ్గింపు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటంతోపాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీంతో గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు చేరుతోంది. అందువల్ల ఆగస్టులో టాటా కార్లలో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్‌గా కర్వ్ ఈవీ నిలిచింది.
హారియర్, సఫారీపై రూ.45,000 వరకు
హారియర్, సఫారీ డీజిల్ మోడళ్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. అర్హతలను బట్టి గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంటుంది.
హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు
హారియర్ ఈవీపై మాత్రం మరింత భారీ ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.75,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫ్రీడమ్ సెలబ్రేషన్ ఆఫర్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తాయి. ఇప్పటికే టాటా ఈవీ లేదా ఐసీఈ వాహనం కలిగి ఉన్న అర్హతగల కస్టమర్లకు లాయల్టీ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. మొత్తం ప్రయోజనం గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు చేరవచ్చు.
సియెర్రాపై పరిమిత ఆఫర్లు
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రాపై డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎంపిక చేసిన సియెర్రా డీజిల్ వేరియంట్లపై స్క్రాపేజ్, లాయల్టీ లేదా ఇతర అర్హత ఆధారిత ప్రయోజనాలతో సుమారు రూ.30,000 వరకు బెనిఫిట్ లభిస్తోంది. సియెర్రా ఈవీపై ప్రస్తుతం అధికారిక వినియోగదారుల తగ్గింపు ప్రకటించలేదు.
ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2026 వరకు లేదా సంబంధిత స్టాక్ ఉన్నంతవరకు వర్తించే అవకాశం ఉంది. నగరం, డీలర్, వేరియంట్, మోడల్ ఇయర్, స్టాక్ లభ్యత, కస్టమర్ అర్హతను బట్టి తుది మొత్తం మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు సమీప టాటా మోటార్స్ డీలర్‌షిప్ వద్ద తాజా ఆఫర్, డిస్కౌంట్ బ్రేకప్, ఎక్స్‌షోరూమ్ ధరను నిర్ధారించుకోవడం మంచిది.
ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
Tags : 1