Breaking News

భారత్‌లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ

Published on Sat, 06/08/2024 - 14:19

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్‌ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్‌ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.

డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)