1,000 మందిని తొలగించాలనేది ‘టార్గెట్‌’

Published on Fri, 10/24/2025 - 08:45

కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వృద్ధిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా టార్గెట్ కార్ప్ సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దాంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 800 స్థానాలను భర్తీ చేయకుండా వాటిని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

త్వరలో సంస్థ నిర్వహణ పగ్గాలు చేపట్టబోయే ఇన్‌కమింగ్‌ సీఈఓ మైఖేల్ ఫిడెల్కే కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులకు పంపిన మెమోలో ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఏయే సిబ్బందిపై లేఆఫ్స్‌ ప్రభావం ఉంటుందో త్వరలో తెలియజేస్తామని చెప్పారు. టార్గెట్‌ కార్ప్‌ కంపెనీ అమెరికాలోని టాప్‌ సంస్థల్లో ఒకటిగా ఉంది. కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియను ఖరారు చేస్తున్నందున వచ్చే వారం యూఎస్‌లోని ఉద్యోగులందరూ ఇంటి నుంచి పని చేయాలని మెమోలో ఆదేశించారు.

వినియోగదారుల వ్యయం తగ్గడం, నిర్వహణ ఖర్చులు భారం అవుతుండడంతో టార్గెట్ కార్ప్‌ ఇటీవలి సంవత్సరాలలో పురోగతి సాధించడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 1, 2025 నాటికి కంపెనీ సుమారు 4,40,000 మందికి ఉపాధి కల్పించింది.

ఇదీ చదవండి: ర్యాంక్‌ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)