నిప్పన్‌ లీక్‌లెస్‌కు టాల్‌బ్రోస్‌ గుడ్‌బై 

Published on Sat, 12/23/2023 - 07:26

ముంబై: భాగస్వామ్య సంస్థ(జేవీ) నిప్పన్‌ లీక్‌లెస్‌ టాల్‌బ్రోస్‌ నుంచి వైదొలగనున్నట్లు ఆటో విడిభాగాల కంపెనీ టాల్‌బ్రోస్‌ ఆటోమోటివ్‌ కంపోనెంట్స్‌ లిమిటెడ్‌(టీఏసీఎల్‌) తాజాగా పేర్కొంది. నిప్పన్‌ లీక్‌లెస్‌లో గల మొత్తం 40 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీకి విక్రయించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో జేవీలో 100 శాతం వాటా నిప్పన్‌ లీక్‌లెస్‌ సొంతం కానున్నట్లు తెలియజేసింది.

2005లో నిప్పన్‌ లీక్‌లెస్‌తో జత కట్టడం ద్వారా టాల్‌బ్రోస్‌ జేవీకి తెరతీసింది. నిప్పన్‌కు 60 శాతం, టాల్‌బ్రోస్‌కు 40 శాతం చొప్పున వాటాతో జేవీ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రధానంగా ద్విచక్ర వాహన రంగ దిగ్గజాల(ఓఈఎంలు) కోసం గ్యాస్‌కట్స్‌ తయారు చేసి సరఫరా చేస్తోంది. వ్యూహాత్మక బిజినెస్‌ సమీక్షలో భాగంగా నిప్పన్‌ లీక్‌లెస్‌ టాల్‌బ్రోస్‌లో మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు టీఏసీఎల్‌ జేఎండీ అనుజ్‌ తల్వార్‌ వివరించారు.

కంపెనీ గ్యాస్‌కట్స్‌సహా హీట్‌ షీల్డ్స్, ఫోర్జింగ్స్, సస్పెన్షన్‌ సిస్టమ్స్, యాంటీవైబ్రేషన్‌ ప్రొడక్టులు తదితరాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. జేవీలో 40 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 82 కోట్లు లభించనున్నట్లు టీఏసీఎల్‌ వెల్లడించింది. మార్చిలోగా వాటా విక్రయం పూర్తికాగలదని భావిస్తోంది. నిధులను విస్తరణ, భవిష్యత్‌ పెట్టుబడులకు వినియోగించనుంది.  వాటా విక్రయ వార్తలతో టాల్‌బ్రోస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం పుంజుకుని రూ. 303 వద్ద ముగిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)