Breaking News

స్విగ్గీకి ‘క్విక్‌’గా వచ్చిన నష్టాలు.. 3 నెలల్లో డబుల్‌!

Published on Sun, 05/11/2025 - 12:28

ఫుడ్‌ డెలివరీ, క్విక్‌కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టం రెట్టింపై రూ. 1,081 కోట్లను తాకింది. క్విక్‌కామర్స్‌పై భారీ పెట్టుబడులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నష్టం ప్రకటించింది. 

మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,046 కోట్ల నుంచి రూ. 4,410 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మరింత అధికంగా రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,610 కోట్లకు పెరిగాయి. ఫుడ్‌ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్‌ విలువ 18 శాతం అధికమై రూ. 7,347 కోట్లకు చేరినట్లు స్విగ్గీ వెల్లడించింది. నిర్వహణ లాభం(ఇబిటా) ఐదు రెట్లు ఎగసి రూ. 212 కోట్లను తాకింది. స్విగ్గీ స్మార్ట్‌ సగటు ఆర్డర్‌ విలువ 13 శాతం మెరుగుపడి రూ. 527కు చేరగా.. 316 డార్క్‌ స్టోర్లను జత కలుపుకుంది.

కాగా స్విగ్గీ ప్రధాన పోటీదారు ఈ మధ్యనే ఎటర్నల్‌గా పేరు మార్చుకున్న జొమాటో నికర లాభాలు కూడా భారీగా పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సంస్థ నికర లాభాలు 78 శాతం పతనమై రూ39 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ రెవెన్యూ 64 శాతం పెరిగి రూ.5,833 కోట్లుగా చోటు చేసుకుంది. కంపెనీ వ్యయాలు 68 శాతం పెరిగి రూ.6,104 కోట్లకు చేరడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)