ర్యాపిడోలో స్విగ్గీ వాటా విక్రయం

Published on Wed, 09/24/2025 - 09:03

బైక్‌ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ర్యాపిడో(Rapido)లోగల వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఆన్‌డిమాండ్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) తాజాగా వెల్లడించింది. ర్యాపిడో మాతృ సంస్థ రోపెన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌లో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ.2,400 కోట్లు అందుకోనున్నట్లు తెలియజేసింది. ర్యాపిడో సైతం ఫుడ్‌ డెలివరీ(Food Delivery) సేవలలోకి  ప్రవేశించనున్న నేపథ్యంలో వాటా విక్రయాన్ని చేపట్టనున్నట్లు జులైలోనే స్విగ్గీ సంకేతమిచ్చింది.

దీనిలో భాగంగా 10 ఈక్విటీ షేర్లతోపాటు.. తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 1,63,990 సిరీస్‌ డి ప్రిఫరెన్స్‌ షేర్ల(సీసీపీఎస్‌)ను ఎంఐహెచ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వన్‌ బీవీ(నెదర్లాండ్స్‌)కు విక్రయించనుంది. వీటి విలువ రూ. 1,968 కోట్లుకాగా.. వాటాదారులకు లబ్దిని చేకూర్చేబాటలో పెట్టుబడులను ప్రోజస్‌ గ్రూప్‌ సంస్థ ఎంఐహెచ్‌కు విక్రయించనున్నట్లు స్విగ్గీ తెలియజేసింది. ఈ బాటలో ర్యాపిడోకు చెందిన తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 35,958 సిరీస్‌ డి ప్రిఫరెన్స్‌ షేర్ల(సీసీపీఎస్‌)ను సెబీ వద్ద రిజిస్టరైన వెస్ట్‌బ్రిడ్జి సంస్థ సేతు ఏఐఎఫ్‌ ట్రస్ట్‌కు అమ్మివేయనున్నట్లు పేర్కొంది. 

ఈ డీల్‌ విలువ రూ. 431.5 కోట్లుగా వెల్లడించింది. వెరసి ర్యాపిడోలో వాటాను రూ. 2,400 కోట్లకు విక్రయించనుంది. కాగా.. ఇన్‌స్టామార్ట్‌ బ్రాండుతో నిర్వహిస్తున్న క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ విభాగాన్ని పరోక్ష సొంత అనుబంధ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నట్లు వివరించింది. స్లంప్‌ సేల్‌ పద్ధతిన విక్రయాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది.

ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్‌బీఐ అంచనా

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)