Breaking News

స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడి

Published on Sat, 02/22/2025 - 11:18

ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ(Swiggy) తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యలో భాగంగా కంపెనీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘స్కూట్సీ(Scootsy)’లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో డిసెంబర్‌లో రూ.1,600 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఒక్కో స్కూట్సీ షేరు విలువ రూ.7,640గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు.

స్విగ్గీ క్విక్‌ కామర్స్‌ వ్యాపారం ఇన్‌స్టామార్ట్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర మూలధన వ్యయాలకు ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2018లో స్విగ్గీ కొనుగోలు చేసిన స్కూట్సీ.. రెస్టారెంట్, రుచికరమైన ఆహారం, టాయ్స్‌, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్ సహా మరెన్నో కేటగిరీల్లో ఇంట్రాసిటీ ఆన్‌లైన్‌ డెలివరీ అందించే ప్లాట్‌ఫామ్‌. ఇది హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటైలర్‌లకు గోదాము నిర్వహణ, వేర్ హౌస్ ప్రాసెసింగ్, ఆర్డర్ ఫుల్ ఫిల్‌మెంట్‌, ప్యాకింగ్, షిప్పింగ్ సేవలను కూడా అందిస్తుంది.

పెరుగుతున్న టర్నోవర్‌

2024 ఆర్థిక సంవత్సరంలో స్కూట్సీ రూ.5,796 కోట్ల టర్నోవర్‌ను నివేదించింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,686 కోట్లుగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,580 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సప్లై చెయిన్‌ సేవల నుంచి స్విగ్గీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1,693 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: వచ్చేవారం యూఎస్‌ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్‌

క్విక్‌ కామర్స్‌లో భారీగా పెట్టుబడులు

వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను పొందడానికి స్విగ్గీ, దాని ప్రత్యర్థి జొమాటో రెండూ తమ క్విక్‌ కామర్స్‌ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్కూట్సీలో తాజా పెట్టుబడి దాని లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను మెరుగుపరచడానికి, కస్టమర్లకు సమర్థవంతమైన, సకాలంలో డెలివరీలను అందించేందుకు తోడ్పడుతుందని స్విగ్గీ తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)