Breaking News

టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్‌ ప్లాంటులో తయారీ

Published on Sun, 11/03/2024 - 09:05

న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని టయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్‌ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్‌ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికల్‌) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్‌–న్యూట్రల్‌ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్‌ తోషిహిరో సుజుకీ తెలిపారు.

ఇదీ చదవండి: టీవీఎస్‌ రికార్డ్‌.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!

ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్‌ కార్పొరేషన్, సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)