Breaking News

25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?

Published on Mon, 07/03/2023 - 19:35

Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది.

దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్‌ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్‌ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్‌ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది.

సుజుకి హయాబుసా పవర్‌ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్
హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది. రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

(ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?)

అంచనా ధర & ప్రత్యర్థులు
సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)