Breaking News

కారు రుణాలు వద్దు బాబోయ్‌!

Published on Tue, 09/16/2025 - 08:40

జీఎస్‌టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో తమ కారు రుణం రద్దు చేయాలని కోరుతూ బ్యాంక్‌లకు అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. 1,200సీసీ వరకు సామర్థ్యం కలిగిన కార్లను 28 శాతం నుంచి 18 శాతం జీఎస్‌టీ శ్లాబు కిందకు మారుస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వీటితోపాటు 40 శాతం శ్లాబులోకి మార్చినప్పటికీ, అదనపు లెవీలు లేకపోవడంతో ఖరీదైన కార్ల ధరలు సైతం తగ్గనున్నాయి.

ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కో కారుపై రూ.3 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో ఇప్పటికే కార్ల కొనుగోలుకు రుణ ఆమోదాలను పొందిన కస్టమర్లు బ్యాంక్‌ శాఖలను సంప్రదిస్తున్నారు. జీఎస్‌టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేసుకుంటామని బ్యాంక్‌ అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ  విషయాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. రుణాన్ని రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే దాని కంటే జీఎస్‌టీలో మార్పుల ఫలితంగా ఒక్కో కారుపై తగ్గే ధర అధికంగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి రుణానికి దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో కస్టమర్లు ఉన్నట్టు తెలిపారు.  

హైఎండ్‌ వేరియంట్స్‌ పట్ల ఆసక్తి

కారు డీలర్లు ఇప్పటికే జారీ చేసిన ఇన్వాయిస్‌లకు సంబంధించి పాత జీఎస్‌టీ రేట్లు అమలవుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేవారు. దీని ప్రకారం సెప్టెంబర్‌ 22 నుంచి జారీ చేసే ఇన్వాయిస్‌లకు కొత్త రేట్లు అమలవుతాయని తెలుస్తోంది. ధరలు తగ్గడంతో మరిన్ని ఫీచర్లు ఉన్న మెరుగైన మోడళ్లకు వెళ్లాలని కొందరు కొనుగోలు దారులు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కార్లపై 28 శాతం జీఎస్‌టీతోపాటు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్‌ సెస్సును అమలు చేస్తున్నారు. దీంతో నికర రేటు 29% నుంచి 50 శాతం మధ్య ఉంటోంది. సెపె్టంబర్‌ 22 నుంచి 1,200 సీసీ సామర్థ్యం మించని పెట్రోల్, 1,500 సీసీ సామర్థ్యం మించని డీజిల్‌ కార్లపై 18 శాతం జీఎస్‌టీ రేటు, అంతకుమించిన వాటికి 40 శాతం రేటు అమల్లోకి రానుంది.

ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)