సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు: ఎన్నికల్లో ఎవరు గెలిచినా..

Published on Tue, 11/05/2024 - 21:27

టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడక ముందే ఓ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. కంపెనీ మాత్రం విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఉండాలని, తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గూగుల్‌పై ట్రంప్ ఆరోపణలు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. గూగుల్ తన గురించి చెడు కథనాలను, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే వెల్లడిస్తోంది ఆరోపించారు.

అధ్యక్ష పీఠమెవరికో..
ఇప్పటికే ఒక సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన.. ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదివి చేపడతారా?.. లేక 'కమలా హారిస్'ను ఆ పదవి వరిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఉత్కఠతో ఎదురు చూస్తున్నాయి. కాగా ఇప్పటికే అమెరికాలో పోలింగ్ మొదలైపోయింది. ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠమెవరిదనేది తెలిసిపోతుంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)