Breaking News

సుందర్‌ పిచాయ్‌ ఇక బిలియనీర్‌..

Published on Fri, 07/25/2025 - 18:30

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్క్లబ్లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్నెట్వర్త్1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.

2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.

సీఈవోగా పదేళ్లు

ఆల్ఫాబెట్సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.

నిరాడంబర నేపథ్యం..

సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు