Breaking News

మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..

Published on Sat, 01/27/2024 - 16:17

నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు.

ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది.

టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది.

ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్‌ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు.

ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి

మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)