Breaking News

కోట్ల ఖర్చుతో పెళ్లి.. ఆడంబరమే అయినా ఆదర్శమూ ఉంది..

Published on Wed, 04/05/2023 - 13:20

భారత దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద వేడుక. సామాన్య మధ్య తరగతి వారి నుంచి సంపన్నుల వరకూ వారి వారి స్థాయిలో వివాహ వేడుకను జరిపిస్తుంటారు. ఇక బడా వ్యాపారవేత్తల సంగతి చెప్పనక్కర లేదు. అత్యంత ఆడంబరంగా జరిగిన చాలా పెళ్లిళ్ల గురించి మనకు తెలుసు. అయితే ఆడంబరంతో పాటు ఆదర్శం కూడా ఉన్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త కొడుకుల జంట వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

(అమెజాన్‌ నుంచి 100 మంది అవుట్‌!) 

సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతో రాయ్‌ల  వివాహాలు 2004లో ఒకే వేదికలో జరిగాయి. రూ. 550 కోట్లతో అంగరంగ వైభవంగా వారి వివాహాలు జరిపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో నాలుగు రోజుల పాటు జరిగిన వివాహానికి అతిథులను ప్రైవేట్ జెట్‌లలో తరలించినట్లు వార్తలు వార్తలు వచ్చాయి.  అయితే ఆ విలాసవంతమైన వివాహాలకు సంబంధించి ఆదర్శవంతమైన మరో కోణం ఉంది

కుమారుల వివాహం సందర్భంగా సుబ్రతా రాయ్‌ కుటుంబం  వివిధ మతాలు, కులాలకు చెందిన 101 మంది నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చేసి సుమారు 15000 మంది పేదలకు భోజనం అందించారు. కాగా సుశాంతో, సీమాంతోల వివాహ వేడుకలకు దాదాపు 11,000 మంది అతిథులు హాజరయ్యారు.

(వామ్మో.. పసిడి పరుగు, వెండి హై జంప్‌!)

వివాహ వేడుకలో 100కి పైగా వివిధ రకాల వంటకాలను వడ్డించారు. సుశాంతో రాయ్ రిచా అహుజాను, సీమంతో రాయ్ చాందిని తూర్‌ను వివాహం చేసుకున్నారు. వివాహ వేదికను ఖరీదైన పూలు, పాలిష్ లైట్లు, ప్రిజం గ్లాసులు, దీపాలతో అద్భుతంగా అలంకరించారు. అతిథులలో పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)