Breaking News

టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు

Published on Wed, 08/21/2024 - 14:16

భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్‌టెల్‌, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్‌ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్‌ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్‌’ అనే ప్రాజెక్ట్‌ ద్వారా 180 టెరాబిట్స్‌ పర్‌ సెకండ్‌(టీబీపీఎస్‌) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్‌టెల్‌, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్‌ ఏర్పాటు చేస్తారు.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్‌ నిలిపివేత!

ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్‌ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్‌ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్‌ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ముంబయి, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్ట్‌ ద్వారా జియో, చైనా మొబైల్‌ కంపెనీలు 200 టీబీపీఎస్‌ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్‌ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్‌, యూరప్‌ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)