Breaking News

ఏయే పథకాలకు డిమాండ్‌ ఉందంటే..

Published on Wed, 09/02/2026 - 08:38

ఆర్థిక ప్రగతి, ఆదాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీమా వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ప్రొటెక్షన్, సేవింగ్స్, రిటైర్మెంట్‌ పథకాలకు డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఇవే ఎల్‌ఐసీ తదుపరి దశ వృద్ధి అధ్యాయాన్ని లిఖిస్తాయని కంపెనీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన తెలిపారు. పార్లమెంటు చట్టం ద్వారా 1956 సెప్టెంబర్‌ 1న ఎల్‌ఐసీ ఏర్పాటైంది. 70 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఘనత ఉన్నంత మాత్రాన సవాళ్లు లేకుండా పోవని దొరైస్వామి పేర్కొన్నారు.

ప్రజలకు నేడు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, టెక్నాలజీ కారణంగా ఆకాంక్షల్లోనూ మార్పులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా యువ కస్టమర్లు.. బీమా అనేది సరళతరమైనదిగా, తమ తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, తక్షణం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా తనను తాను మల్చుకునేందుకు ఎల్‌ఐసీ కృషి చేస్తోందని .. ప్రోడక్ట్‌ పోర్ట్‌ఫోలియోని, టెక్నాలజీని, పంపిణీ విధానాలను మెరుగుపర్చుకుంటోందని చెప్పారు.  

రూ. 5 కోట్లతో ప్రారంభమై..

ఏడు దశాబ్దాల క్రితం రూ. 5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు ఆర్థిక దిగ్గజంగా ఎదిగిందని దొరైస్వామి చెప్పారు. ఈ విజయాన్ని రూపాయల్లో కొలవలేమని, దీనికి ప్రజల నమ్మకమే సరైన కొలమానమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఒడిదుడుకులు పెరుగుతున్న తరుణంలో పాలసీదారులకు పోటీ సంస్థలతో పోలిస్తే దీటైన ప్రయోజనాలు అందించేలా తమ ఫండ్స్‌పై రాబడులను పెంచుకునేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నట్లు దొరైస్వామి వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం ర. 5,35,984 కోట్లకు చేరగా, లాభం రికార్డు స్థాయిలో రూ. 57,419 కోట్లకు ఎగియడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.  

రెండు కొత్త పథకాలు ..

70వ వార్షికోత్సవం సందర్భంగా దొరైస్వామి రెండు కొత్త పథకాలను ఆవిష్కరించారు. బీమా ప్లాటినం, జీవన్‌ రక్షా పాలసీలు వీటిలో ఉన్నాయి. బీమా ప్లాటినం అనేది పొదుపు, ప్రొటెక్షన్‌ మేళవింపుగా ఉంటుంది. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్‌. వార్షికంగా చెల్లించే ప్రతి రూ. 1,000కి రూ. 70 జతవుతుంది. ప్రస్తుత ఎల్‌ఐసీ పాలసీదారులు, మరణించిన పాలసీదారుల నామినీలు/లబ్ధిదారులకు రిబేటు లభిస్తుంది. ఇక జీవన్‌ రక్ష అనేది ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్‌గా ఉంటుంది. కనిష్ట, గరిష్ట సమ్‌ అష్యూర్డ్‌లు వరుసగా రూ.5 లక్షలు, రూ.24 లక్షలుగా ఉంటాయి.

ఇదీ చదవండి: బెర్త్ బుక్‌ చేసినా.. పడుకోకూడదు!

Videos

Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..

లండన్ లో త్రిష.. విజయ్ వెళ్ళేది ఆమె కోసమేనా!

టైల్స్ పై పడుకొని కెమెరా కెమెరా మెన్ లకు నమస్కారం

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)