Breaking News

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Tue, 11/26/2024 - 09:59

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 106.72 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద నిలిచాయి. సోమవారం ఉదయం నుంచి లాభాలబాట పట్టిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ (మంగళవారం) నష్టాల్లోనే ముగిశాయి.

శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 24,249కు చేరింది. సెన్సెక్స్‌ 82 పాయింట్లు ఎగబాకి 80,175 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.81 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.01 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.3 శాతం పెరిగింది. నాస్‌డాక్‌ 0.14 శాతం పుంజుకుంది.

ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్‌కవరింగ్‌తో పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)