Breaking News

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Fri, 11/22/2024 - 09:33

శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్‌ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 74.4 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.5 శాతం పెరిగింది. నాస్‌డాక్‌ 0.03 శాతం పుంజుకుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)