Breaking News

ఐటీ స్టాక్‌ల ర్యాలీ.. లాభాల్లో సూచీలు

Published on Mon, 01/06/2025 - 09:32

దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఈ సమయం వరకు ఐటీ స్టాక్‌లు ఎక్కువగా ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తుంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌(Crude Oil) బ్యారెల్‌ ధర 76.3 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.26 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.77 శాతం ఎగబాకింది.

దేశీ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.

ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా

వారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్‌(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్‌ నెలకు హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్‌ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)