Breaking News

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Mon, 01/20/2025 - 09:34

భారతీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 454 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 77,073.44 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,584.84- 77,318.94 రేంజ్‌లో ట్రేడ్ అయింది.  ఎన్‌ఎస్‌ఈ (Nifty) నిఫ్టీ 50 కూడా 141 పాయింట్లు లేదా 0.61 శాతం లాభంతో 23,344.75 వద్ద గ్రీన్ జోన్‌లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.10 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,170.65 వద్ద ఉంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిపిసిఎల్ నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 29 సానుకూలంగా ముగిశాయి. దీనికి విరుద్ధంగా ఎస్‌బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి. 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌(Crude Oil) ధర 80.77 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.51 శాతం ఎగబాకింది.

క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.

ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్‌ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి యూఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్‌ మార్కెట్లపైనా ట్రంప్‌ ఎఫెక్ట్‌ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)