Breaking News

వరుస నష్టాలు.. నిఫ్టీ@23,440

Published on Fri, 01/10/2025 - 09:42

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో  ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌(Crude Oil) బ్యారెల్‌ ధర 77.22 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.06 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేత

మార్కెట్‌ రేటింగ్‌కు హెచ్‌ఎస్‌బీసీ కోత..

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్‌ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్‌’ నుంచి ‘న్యూట్రల్‌’కి తగ్గించింది. కార్పొరేట్‌ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్‌ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)