Breaking News

మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్లు

Published on Thu, 12/26/2024 - 09:46

గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39  పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.

అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.

స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.

ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్‌లు మాత్రమే నష్టాల్లో  ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్‌లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్‌బీఐ (SBI)  ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్‌లతో సహా ఐదు స్టాక్‌లు మాత్రమే దిగువన ట్రేడింగ్‌లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్‌బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్‌ గెయినర్స్‌.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)