Breaking News

కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published on Wed, 12/18/2024 - 16:01

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 24,198 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 502 పాయింట్లు దిగజారి 80,182 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇదీ చదవండి: వింటేజ్‌ కారు ధర రూ.3,675!

భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగియడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ: వడ్డీరేట్ల తగ్గింపుపై దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు రాత్రి దీనికి సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి. రేపు మన మార్కెట్లో దీని ‍ప్రభావం ఉండనుంది.

చైనా ఆర్థిక మందగమనం: చైనా తాజా గణాంకాలు ఊహించిన దానికంటే బలహీనమైన ఆర్థిక పనితీరును చూపించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌ను ప్రభావితం చేసింది. భారతదేశ మెటల్, ఆటో స్టాక్‌లను ప్రభావితం చేసింది.

యూఎస్ డాలర్ బలపడటం: బలమైన డాలర్ భారతీయ ఈక్విటీల వైపు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. డాలర్ డినామినేషన్‌ చెల్లించే రుణాలు కంపెనీలకు భారంగా మారుతాయి.

వాణిజ్య లోటు పెరుగుదల: నవంబర్‌లో వాణిజ్య లోటు గణనీయంగా పెరగడంతో రూపాయిపై ఒత్తిడి అధికమైంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)