Breaking News

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Published on Thu, 12/12/2024 - 09:57

గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 236.18 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 81,289.96 వద్ద, నిఫ్టీ 93.10 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 24,548.70 వద్ద నిలిచాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో నిలువగా.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందూస్తాన్ యూనీలీవర్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 24,646కు చేరింది. సెన్సెక్స్‌ 53 పాయింట్లు ఎగబాకి 81,591 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.63 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.5 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.82 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.77 శాతం పుంజుకుంది.

దేశీయంగా అక్టోబర్‌ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)