Breaking News

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Fri, 12/06/2024 - 09:41

శుక్రవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో మొగిశాయి. సెన్సెక్స్ 87.03 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 81,678.83 వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,669.05 వద్ద నిలిచాయి.

టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేశాయి.

ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటనకు ముందు భారత బెంచ్‌మార్క్  ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 81,874 వద్ద ఉంది. నిఫ్టీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టంతో 24,695 వద్ద ఉంది.

గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)