Breaking News

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Mon, 12/02/2024 - 09:54

సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 450.99 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 80,253.78 వద్ద, నిఫ్టీ 142.90 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 24,274.00 వద్ద నిలిచాయి.

అల్ట్రా టెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,124కు చేరింది. సెన్సెక్స్‌ 108 పాయింట్లు దిగజారి 79,689 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 72.1 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.42 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.83 శాతం పుంజుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్‌ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)