Breaking News

పుంజుకున్న మార్కెట్లు.. కొత్త గరిష్టాలకు సూచీలు

Published on Wed, 09/25/2024 - 15:49

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలైన  బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 ప్రారంభ నష్టాలను తిప్పికొట్టాయి. ట్రేడింగ్ సెషన్‌ను రికార్డ్ హై ముగింపు స్థాయిలలో ముగించే ముందు కొత్త గరిష్టాలను తాకాయి.

సెన్సెక్స్ 255.83 పాయింట్లు లేదా 0.30 శాతం పుంజుకుని 85,169.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 85,247.42కి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 63.75 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 26,004.15 వద్ద సెషన్‌ను ముగించే ముందు 26,032.80 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.

నిఫ్టీ లిస్టింగ్‌లో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టాటా మోటర్స్‌, టైటాన్‌ టాప్‌ లూజర్స్‌ జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)