Breaking News

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఈరోజే స్ట్రెస్‌ టెస్ట్‌ నివేదిక

Published on Fri, 03/15/2024 - 09:26

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,089కు చేరింది. సెన్సెక్స్‌ 188 పాయింట్లు పుంజుకుని 72,916 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌ ఇండెక్స్‌ 103.39 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 85.15 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌పీఎక్స్‌ 0.29 శాతం, నాస్‌డాక్‌ 0.3 శాతం నష్టపోయాయి.

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ టోకు ధరల సూచీ మైనస్‌ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి.

సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి స్ట్రెస్‌ టెస్ట్‌ డేటాను ఈరోజున రానుంది. దాంతో ఫండ్స్‌లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్‌ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని మ్యూచువల్‌ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)