Breaking News

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

Published on Thu, 02/15/2024 - 09:22

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 21,900కు చేరింది. సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 71,998 వద్ద ట్రేడవుతోంది.

ఎఫ్‌ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.3929.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2897.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్‌లోని నాస్‌డాక్‌ బుధవారం ముగింపు సమయానికి 1.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్‌ బాండ్‌ఈల్డ్‌లు 5 పాయింట్లు నష్టపోయి 4.27శాతానికి చేరాయి. డాలర్‌ ఇండెక్స్‌ 0.26 శాతం నష్టపోయి 104.69 పాయింట్లకు చేరింది.

క్రూడాయిల్‌ ధర 1.5శాతం తగ్గి బ్యారెల్‌ ధర 81.53 డాలర్లకు చేరింది. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ మిసైల్‌ను ప్రయోగించింది. దాంతో అంతర్జాతీయంగా కొంత అనిశ్చితులు నెలకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ​కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్‌ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫ​ంటమెంటల్స్‌పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్‌ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)