Breaking News

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు

Published on Tue, 01/02/2024 - 09:53

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 21,716 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు దిగజారి 72,141 వద్ద ట్రేడవుతోంది. 

కొత్త సంవత్సరం నేపథ్యంలో యూఎస్‌, యూరప్‌ మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 2023 డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.855 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.410 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్దకు చేరింది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)