Breaking News

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published on Wed, 10/23/2024 - 09:20

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24,441కు చేరింది. సెన్సెక్స్‌ 63 పాయింట్లు నష్టపోయి 80,144 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.7 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.05 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.18 శాతం లాభపడింది.

ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్‌ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..

కార్పొరేట్‌ కంపెనీల సెప్టెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు  తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌..నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్‌ ఇండెక్సు 104.1 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)