Breaking News

ఈ వారం అనిశ్చితులు కొనసాగుతాయా..?

Published on Sun, 12/01/2024 - 21:14

అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ గణాంకాలు మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు ఈ వారం కూడా అదే రీతిలో ఉన్నా కాస్తా నెమ్మదించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరుగుతున్నందున మార్కెట్లో ఆటుపోట్లు తప్పవు.  

జీడీపీ మందగమనం

గత వారం చివర్లో జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఈ గణాంకాలు నమోదు కావడం మార్కెట్‌ను నిరుత్సాహపరుచనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కేవలం 5.4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నమోదైన వృద్ధి రేటు 6.7  శాతంతో పోల్చి చూసినా తక్కువే. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి మందగించడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత అంకెలు అంచనాలకు దూరంగా ఉండటం ఈవారం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ముగింపు వరకు కాస్తా కోలుకోవచ్చని అంచనా.

ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగే అవకాశం..

అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదార్లుగా నిలిచినప్పటికీ అది మూడు రోజులకే పరిమితమైంది. గత వారం చివరి రెండు రోజుల్లో ఏకంగా దాదాపు రూ.16000 కోట్ల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఐఐలు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతుండగా మరోపక్క దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) మాత్రం మార్కెట్‌కు తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐల అమ్మకాలు డిసెంబర్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..

గత వారాంతాన అమెరికా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్కెట్లకు కొత్త శక్తినిస్తూ రికార్డుల  వైపు పరుగు తీయిస్తున్నాయి. డోజోన్స్, ఎస్ & పీ ఇండెక్స్‌లు దూసుకెళుతుండగా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావంతో నాస్డాక్‌ సూచీ పడిపోయేందుకు కారణమవుతుంది. ఇది మన మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేస్తోంది. ఈవారం కూడా అమెరికా మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉన్నందుకు ఇది కొంతవరకు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపొచ్చు.

ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’

సాంకేతిక స్థాయులు

సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. నిఫ్టీ గతవారం 24130 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఒక రకంగా అమ్మకాల స్థాయిని సూచిస్తోంది. సోమవారం నిఫ్టీ తొలి గంటలో 24150 స్థాయికి దిగువన ట్రేడ్ అయితే అమ్మకాల ఉద్ధృతి మరింత పెరుగుతుంది. ఇదే కొనసాగితే ఈవారం నిఫ్టీ 23800 మార్కును చేరవచ్చు. దాన్ని కూడా బ్రేక్‌ చేస్తే తదుపరి మద్దతు స్థాయి 23300కు పడిపోయే అవకాశం ఉంది.

- బెహరాశ్రీనివాసరావు

మార్కెట్‌ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్ట్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?