Breaking News

దలాల్‌ స్ట్రీట్‌.. ఢమాల్‌! మార్కెట్ల భారీ పతనం

Published on Thu, 10/03/2024 - 16:01

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటర్స్‌, రిలయన్స్‌, మారుతీ సుజుకీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, లార్సెన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటర్స్‌ భారీ నష్టాలను చవి చూశాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్‌ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు  లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్‌ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు