Breaking News

ఐపీవోకు స్టీమ్‌హౌస్‌ ఇండియా

Published on Thu, 07/03/2025 - 08:39

ఇండ్రస్టియల్‌ స్టీమ్‌ అండ్‌ గ్యాస్‌ సరఫరా కంపెనీ స్టీమ్‌హౌస్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500–700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. మెయిన్‌బోర్డులో లిస్టింగ్‌పై కన్నేసిన కంపెనీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. 2014లో ఏర్పాటైన సంజూ గ్రూప్‌ కంపెనీ సూరత్‌ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు విస్తరించింది. 167 క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది.

ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’

పిరానా, దహేజ్‌ సెజ్‌సహా.. వపీ, అంకలేశ్వర్, నందెశారీ, పనోలీ ఫేజ్‌–2, 3లలో విస్తరణ చేపట్టింది. ఈ బాటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా, రాజస్తాన్‌లలోనూ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. 2023–24లో రూ. 292 కోట్ల ఆదాయం, రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల రహస్య పద్ధతిలో ఫైలింగ్‌కు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా క్యాపిటల్, ఫిజిక్స్‌వాలా, ఇమేజిన్‌ మార్కెటింగ్‌(బోట్‌)తోపాటు.. షాడోఫ్యాక్స్‌ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్‌ ఏఎంసీ, షిప్‌రాకెట్‌ ఇదే బాటలో సాగాయి. 2024 చివర్లో స్విగ్గీ, విశాల్‌ మెగామార్ట్‌ ఇదే విధంగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)