Breaking News

ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో!

Published on Sun, 12/22/2024 - 09:03

జైసల్మేర్‌: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను (ఏటీఎఫ్‌) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్‌ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్‌ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్‌ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్‌ చేసే పేమెంట్‌ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్‌టెక్‌ సర్వీసెస్, పేమెంట్‌ గేట్‌వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్‌ ఆమోదించింది. 

ఆరోగ్య బీమాపై..  
బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్‌ కోసం సీనియర్‌ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్‌ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది.  

పాత ఈవీలపై పన్ను.. 
పాత ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్‌/డీజిల్‌ కారును విక్రయిస్తే మార్జిన్‌ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్‌) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్‌కార్న్‌పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్‌ వివరణ ఇచ్చింది. 50 శాతం పైగా ఫ్లైయాష్‌ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్‌ ఏరేటెడ్‌ కాంక్రీట్‌ (ఏసీసీ) బ్లాక్స్‌పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)