Breaking News

ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి

Published on Tue, 11/15/2022 - 21:34

ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారం కానున్నాయి. ఈ పెంచిన రేట్లు నవంబర్‌ 15, 2022 నుండి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా నిర్ణయించబడతాయి. 

అయితే ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు అంతకుముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు (bps) 8.05 శాతానికి పెంచింది

 అలాగే, రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌లను ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌లను ఒక్కొక్కటి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. 

6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్‌నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే 
కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే ..ఎంసీఎల్‌ఆర్‌ లేదా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ అంటారు. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్‌ఆర్‌ ఆటోమేటిక్‌గా రుణాల కాస్ట్‌పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎంసీఎల్‌ఆర్‌ లింక్డ్‌ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్‌ఆర్‌పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది.

Videos

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

Photos

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)