Breaking News

పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్‌లు భావించడం లేదు

Published on Fri, 03/01/2024 - 00:47

న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లలో గవర్నెన్స్‌ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్‌పే వంటి టాప్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్‌డాట్‌వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్‌ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్‌లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.  

మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్‌లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ చైర్మన్‌ సంజయ్‌ నాయర్‌ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్‌ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు.

ప్రతి స్టార్టప్‌ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్‌ కన్సల్టెక్‌ సహ వ్యవస్థాపకుడు సందీప్‌ ఖేతాన్‌ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్‌లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్‌ వ్యవస్థాపకుడు సంజీవ్‌ బిక్‌చందానీ అభిప్రాయపడ్డారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)