Breaking News

అవి స్టార్టప్‌లు కావు.. ‘అప్‌స్టార్ట్‌లు’

Published on Fri, 11/15/2024 - 12:37

ముంబై: చాలా వరకు స్టార్టప్‌‌లది ఆరంభ శూరత్వమేనని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్‌ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్‌ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.

ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్‌స్టార్ట్‌లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్‌కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్‌షిప్‌ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్‌లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్‌ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.

ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్‌లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్‌లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్‌ బజాజ్‌ ఈ విధంగా బదులిచ్చారు. బైక్‌లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)