Breaking News

1000 ట్రక్కుల భారీ ఆర్డర్‌.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్

Published on Sun, 04/07/2024 - 13:23

ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్‌ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. 

ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్‌, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్‌ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఎంత రేంజ్‌ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు.

"మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్‌ శ్రవణ్ పేర్కొన్నారు.  ట్రెసా మోటార్స్  అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)