Breaking News

డేటా లీక్‌.. రూ.57 లక్షలు డిమాండ్‌!

Published on Sat, 10/12/2024 - 21:30

కస్టమర్ డేటా, మెడికల్ రికార్డుల లీక్‌ వ్యవహారానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ కొత్త విషయాన్ని వెల్లడించింది.  సైబర్‌హ్యాకర్లు తమను 68,000 డాలర్లు (రూ.57 లక్షలు) డిమాండ్ చేసినట్లు తెలిపింది.

టెలిగ్రామ్ చాట్‌బాట్‌లు, వెబ్‌సైట్‌ను ఉపయోగించి పన్ను వివరాలు, మెడికల్ క్లెయిమ్ పేపర్‌లు సహా కస్టమర్‌ల సున్నితమైన డేటాను హాకర్‌ లీక్ చేసినట్లు రాయిటర్స్‌ నుంచి కథనం వెలువడిన తర్వాత కంపెనీ వ్యాపార సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో స్టార్‌ హెల్త్‌ షేర్లు 11% క్షీణించాయి. ఈ డేటా లీక్‌ వ్యవహారంపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది. టెలిగ్రామ్,  హ్యాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.

టార్గెటెడ్ సైబర్‌అటాక్‌కు గురైనట్లు గతంలో చెప్పిన స్టార్, హ్యాకర్‌ తమను 68,000 డాలర్లు డిమాండ్‌ చేస్తూ గత ఆగస్ట్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌లకు ఈమెయిల్‌ పంపినట్లు తాజాగా వెల్లడించింది.

డేటా లీక్‌లో తమ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కంపెనీ దర్యాప్తు చేస్తోందని రాయిటర్స్ నివేదికపై భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు స్టార్ నుండి వివరణలు కోరిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అంతర్గత విచారణ కొనసాగుతున్నప్పటికీ, అధికారి అమర్జీత్ ఖనుజా ఎలాంటి తప్పు చేయలేదని స్టార్ పునరుద్ఘాటించడం గమనార్హం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)