Breaking News

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభం రూ.645 కోట్లు

Published on Wed, 01/29/2025 - 21:21

దేశంలో అతి పెద్ద రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Star Health Insurance) 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 645 కోట్ల లాభం (PAT) నమోదు చేసింది.

2025 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (9MFY25) ఆర్థికంగా, నిర్వహణపరంగా స్టార్ హెల్త్ స్థిరమైన పనితీరును సాధించింది. కంపెనీ కంబైన్డ్ నిష్పత్తి 101.8%గా, క్లెయిమ్స్ నిష్పత్తి 70.66%గా నమోదయ్యాయి. వ్యయ నిష్పత్తి 31.18 శాతంగా ఉంది. పెట్టుబడులపై ఆదాయం రూ. 996 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టిన అసెట్స్ విలువ 15 శాతం పెరిగి రూ. 16,666 కోట్లకు చేరుకుంది.

“టెక్నాలజీని ఉపయోగించుకుని, పటిష్టమైన భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి సులభతరంగా, అందుబాటులో ఉండేలా చూడాలనేది మా లక్ష్యం. ఆరోగ్య సంరక్షణ విషయంలో భారతదేశ పురోభివృద్ధికి తోడ్పడుతూ, ఆరోగ్య బీమా వ్యవస్థను పటిష్టం చేస్తూ, 2047 నాటికి అందరికీ బీమా ఉండాలన్న ఐఆర్‌డీఏఐ చైర్మన్ విజన్‌ను సాకారం చేసే దిశగా, దేశీయంగా బీమా విషయంలో నెలకొన్న అంతరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం” అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)