Breaking News

స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల డేటా లీక్‌.. ఆన్‌లైన్‌లో విక్రయం

Published on Thu, 10/10/2024 - 20:01

న్యూఢిల్లీ: స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్‌ షెన్‌జెన్‌ ఏర్పాటు చేసిన ఓ వెబ్‌ పోర్టల్‌లో స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల ఫోన్‌ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.

స్టార్‌ హెల్త్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (సీఐఎస్‌వో) ఈ డేటాను హ్యాకర్‌కు విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. యూకేకు చెందిన జేసన్‌ పార్కర్‌ అనే పరిశోధకుడు సెప్టెంబర్‌ 20న ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టడం తెలిసిందే. స్టార్‌ హెల్త్‌ కంపెనీకి చెందిన డేటాను షెంజెన్‌ అనే హ్యాకర్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించారు. స్టార్‌ హెల్త్‌ ఇండియాకు చెందిన కస్టమర్లు అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీయే అందించిందని హ్యాకర్‌ షెంజెన్‌ క్లెయిమ్‌ చేయడం గమనార్హం.

దీనిపై స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్పందిస్తూ.. విచారణకు సీఐఎస్‌వో సహకరిస్తున్నారని, అతడు తప్పు చేసినట్టుగా ఎలాంటి సమాచారం గుర్తించలేదని స్పష్టం చేసింది. సంబంధిత సమచారాన్ని ఎవరూ వినియోగించకుండా మద్రాస్‌ హైకోర్ట్‌ నుంచి ఆదేశాలు పొందినట్టు తెలిపింది. స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నిర్వహిస్తున్న ఫోరెన్సిక్‌ దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించింది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)