Breaking News

ప్రైవేట్‌ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు

Published on Wed, 02/28/2024 - 14:24

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య ఖర్చులు మోయలేని భారంగానే మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులో గణనీయమైన వ్యత్యాసాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వివిధ ప్రాంతాల జీవన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య చికిత్సలకు ప్రామాణిక రేటును నిర్థారించే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 

వెటరన్స్ ఫోరమ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్, 2012లోని రూల్ 9 ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లో ప్రతివైద్యానికి ప్రామాణిక ఫీజు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ వివరాలను అ‍న్ని ఆసుపత్రుల్లో స్థానిక భాషలో ప్రచురించి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రతి వైద్యానికి అయ్యే ఖర్చు వివరాలను ఆసుపత్రుల్లో ఉంచాలని తెలిపింది. 

అయితే, ఈ విషయంపై తమ సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందరికీ అందుబాటు ధరలో వైద్యం అందించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఇదీ చదవండి: 900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ

నెలలోపు స్టాండర్డ్ రేట్లను నోటిఫై చేసేలా అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది. లేదంటే పిటిషనర్‌ కోరికమేరకు సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ సూచించిన ప్రామాణిక రేట్లను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)