Breaking News

విస్తరణపై హైదరాబాద్‌ కంపెనీ దృష్టి

Published on Sat, 05/24/2025 - 08:14

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ (ఎస్‌జీఎల్‌టీఎల్‌) సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై వచ్చే 2–3 ఏళ్లలో రూ. 130 కోట్లు పైగా ఇన్వెస్ట్‌ చేయనుంది. ప్రస్తుతం 60 టన్నుల క్రేన్, 60 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్‌ సామర్థ్యం ఉండగా .. 100 టన్నుల క్రేన్, 100 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్‌ స్థాయికి పెంచుకోనున్నట్లు సంస్థ తెలిపింది. 

అలాగే ప్రస్తుతమున్న 5 వెల్డింగ్‌ రోబోల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకోనున్నట్లు పేర్కొంది.  తద్వారా అంతర్జాతీయంగా హెవీ ఇంజినీరింగ్‌ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 16 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 171 కోట్లుగా నమోదైంది. 

గత ఆర్థిక సంవత్సరంలో అన్ని కీలకాంశాల్లోనూ రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. జీఎల్‌ హక్కా జపాన్, ఐపీపీ యూఎస్‌ఏతో భాగస్వామ్యాలు, పటిష్టమైన ఆర్డర్‌ బుక్, కొత్త ప్రొడక్ట్‌ లైన్స్‌తో ఈసారి మరింత మెరుగ్గా రాణించగలమని ధీమా వ్యక్తం చేశారు.  శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1% క్షీణించి రూ. 169 వద్ద క్లోజయ్యింది.

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)