Breaking News

కొత్త శాఖల్లేవు.. స్థిరీకరణకు ప్రాధాన్యం

Published on Sat, 09/27/2025 - 09:11

భారత్‌లో ప్రస్తుతమున్న 100 శాఖలకు అదనంగా కార్యకలాపాల విస్తరణ యోచన లేదని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఇండియా సీఈవో పీడీ సింగ్‌ ప్రకటించారు. పలు విదేశీ బ్యాంకులు భారత్‌లో తమ కార్యకలాపాల స్థిరీకరణకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. స్టాండర్డ్‌ చార్టర్ట్‌ బ్యాంక్‌ మాత్రం పెద్ద శాఖల రూపంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందన్నారు. తద్వారా కస్టమర్ల అవసరాలను సంతృప్తికర స్థాయిలో తీర్చగలమని చెప్పారు. కోల్‌కతా, చెన్నైలో పెద్ద శాఖలను తెరవడాన్ని ప్రస్తావించారు.

ప్రియారిటీ బ్యాంకింగ్‌ సెంటర్లు ప్రస్తుతం ఏడు ఉండగా, వీటిని 21కి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఒకే కస్టమర్‌కు ఒకటికి మించిన ఉత్పత్తులు, సేవలను అందించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా చెన్నై, బెంగళూరులో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లను (జీసీసీలు) స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తూ, 24వేల మందికి ఉపాధి కల్పిస్తుండడం గమనార్హం. ఇవి మరింత వృద్ధి చెందనున్నట్టు సింగ్‌ చెప్పారు. 

ఫారెక్స్‌ సెటిల్‌మెంట్లలో తమకు 8 శాతం వాటా ఉందన్నారు. రూపాయి ఇన్వాయిసింగ్‌కు డిమాండ్‌ పెరుగుతోందని.. మధ్య ప్రాచ్యంలో వాణిజ్యానికి రూపాయి మారకంలో చెల్లింపుల అమలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ రుణాల్లో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)