Breaking News

అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్ష

Published on Wed, 01/29/2025 - 13:31

అదానీ గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం కిలోవాట్‌కు 8.2 యూఎస్‌ సెంట్ల చొప్పున గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విద్యుత్ ధరను యూనిట్‌కు 6 సెంట్ల దిగువకు తీసుకురావాలని కొత్త యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.

స్థానిక బిడ్డర్లు తక్కువ యూనిట్ ధరలకు ఆఫర్ చేయడం.. ఇరవై ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధిక రేటుకు కుదుర్చుకోవాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. అధ్యక్షుడు అనురా కుమార దిస్సానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వారి ప్రస్తుత ప్రాధాన్యతలు, ఇంధన విధానాలకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించింది. అయితే అదానీ గ్రూప్‌, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరి ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటన రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్

మే 2024లో ఆమోదించిన టారిఫ్‌ను పునఃసమీక్షించాలని శ్రీలంక కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రామాణిక సమీక్షా ప్రక్రియలో భాగమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ మొత్తం ప్రాజెక్టును సమీక్షించనుంది. అదానీ గ్రూప్‌ శ్రీలంక గ్రీన్ ఎనర్జీ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ రద్దయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. నిబంధనలు ప్రస్తుత లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి పునరాలోచనలో ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంకలో పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)