సుందరం.. పూజా మందిరం

Published on Sat, 05/03/2025 - 14:36

సాక్షి, సిటీబ్యూరో: కట్టిన ఇల్లు కొంటున్నా.. దగ్గరుండి కట్టించుకుంటున్నా.. ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి విస్తీర్ణం మేరకు ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం మార్కెట్‌లో కోరుకున్న డిజైన్లు, విభిన్న ఆకృతుల్లో లభించే పూజా మందిరాలను కొనుగోలు చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు.

పూజా గది ఏర్పాటు చేసుకునే సౌలభ్యం లేని వారు పూజా మందిరాలపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు చెక్కతో గోడకు ఒకచోట దేవుడి ఫొటోలు పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ సొంతిల్లు కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రస్తుతం.. చిన్నదైనా సరే పూజా మందిరం ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివారి కోసం దాదాపు నగరంలోని అన్ని ఫర్నీచర్‌ షోరూంలలో పూజా మందిరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకటి, రెండు డిజైన్లు మాత్రమే ఉండగా.. వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కానీ, ప్రస్తుతం కావాల్సిన డిజైన్‌లో నచ్చిన ఆకారంతో పూజా మందిరాలు రెడీగా ఉన్నాయి. నచ్చిన విధంగా కావాలంటే ఆర్డర్‌పై తయారు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..

ధరల్లో వ్యత్యాసం..
పూజా మందిరాల్లో సైజు, డిజైన్, ఆకృతిని బట్టి ధరలు ఉంటాయి. సహజంగా వెడల్పు, ఎత్తును బట్టి పూజా మందిరాలు తయారు చేస్తున్నారు. స్థలానికి అనుగుణంగా ఆర్డర్‌పై తయారు చేయించుకోవచ్చు. అయితే వీటి తయారీలో ఉపయోగించే చెక్కను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి. టేక్‌వుడ్, సీసం వుడ్‌ ఇలా కావాల్సిన అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకునే అవకాశం ఉంది. సాధారణ చెక్కతో చిన్న సైజువి ఒక మోస్తారు సైజు వరకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు లభ్యమవుతున్నాయి. సహజంగా మందిరాలను ఓం, స్వస్తిక్‌ బొమ్మలతో తయారు చేయించుకుంటున్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)